![]() |
![]() |
.webp)
జబర్దస్త్ షోకి యాంకర్ గా చేసిన అనసూయ మానేసరికి ఆమె ప్లేస్ లో రష్మీ వచ్చింది. ఇక రష్మీ కూడా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ కి రష్మీ గౌతమ్ యాంకర్ గా చేస్తుండగా మూవీస్ తో బిజీ ఐపోతున్న కారణంగా రష్మిని జబర్దస్త్ నుంచి తప్పించి ఆమె ప్లేస్ లోకి సౌమ్య రావు ని తీసుకొచ్చారు.
ఇక ఈ యాంకర్ వస్తూనే ఆదిని చెడుగుడు ఆడేసుకుంది. ఆది కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఈమె మీద సెటైరికల్ గా డైలాగ్స్ వేసేవాడు. ఇక ఈమెకు తెలుగు రాదు అని చాలా మంది నెటిజన్స్ కూడా అన్నారు. రష్మీని చూసి ఉన్న ఆడియన్స్ కి కొత్త యాంకర్ అలవాటు కావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు సౌమ్య జబర్దస్త్ తో పాటు మాల్స్ ఓపెనింగ్ కి కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన జొస్ అలుక్కాస్ వాళ్ళ ఐవీ జ్యువెలరీని లాంచ్ చేసింది. పసుపు రంగు శారీలో సౌమ్య అదిరిపోయింది.
ఇక ఇదే టైంలో అమ్మడు తన ఫాన్స్ ని ఒక ప్రశ్న వేసింది. దాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. " యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నా..గైస్ మీరేమంటారు ?" అని అడిగింది. ఈరోజున ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలి అంటే అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో అకౌంట్స్ తెరవాల్సింది. ఇక ఇప్పుడు సౌమ్య కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి మరింత ఫెమిలియర్ కావడానికి ట్రై చేస్తోంది. మరి మీరేమంటారు..
![]() |
![]() |